తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో చెరువుల పండుగ వేడుకలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ, బోనాలతో ఆడబిడ్డలు ఆటా, పాటలతో ర్యాలీగా ఊరు నడిబొడ్డు నుండి చెరువుల వద్దకు చేరుకున్నారు. పండుగ వాతావరణంలో డప్పు చప్పుల్లు, డీజే సౌండులతో కోలాటాల సందడితో చెరువుల వద్దకు చేరుకుని సహ పంక్తి భోజనాలు ఆచరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో చెరువులు నిండుకుండలా కళకళలాడుతున్నాయని కొనియాడారు. గ్రామ ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈఓ షాబానా, ఎంపీటీసీ కనకం కొంరయ్య, ఉప సర్పంచ్ కానుగాంటి సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, కారోబార్ తుంగ భాస్కర్, రామక్రిష్ణ, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.