గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దొడ్డు వడ్లు, మక్కలు కొనాలని, చక్కెర కర్మాగారం నడిపించాలని, పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసుల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో పడిగాపులు కాస్తూ రైతు నాయకులు కనిపించారు. మాపై ఉన్న కేసులు ఎప్పుడు పరిష్కారం అవుతాయో అని రైతులు వాపోతున్నారు.