బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలోని డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, మండల నాయకులతో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు సాఫీగా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.