కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం కేసిఆర్ సూచన మేరకు బారసా పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆరు మండలాల ప్రజలు భారీగా తరలివచ్చారు. కేసిఆర్ మాట్లాడుతూ.. చొప్పదండిలో ఎమ్మెల్యేగా సుంకే రవిశంకర్ ను ప్రజలు గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.