రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామంలో అంబేద్కర్ భవనం వద్ద గల మైదానం ఇరువైపులా శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం సేవా సంస్థ సభ్యులు మైదానంలోని స్వచ్ భారత్ సేవా కార్యక్రమం నిర్వహించి ప్లాస్టిక్ కవర్స్ ను తొలగించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం వారు ప్లాస్టిక్ వాడవద్దని, ప్లాస్టిక్ వాడడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.