రామడుగు మండలం వెదిర క్రాస్ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయాలు అయిన ఒక వ్యక్తిని రామడుగు ఎస్సై వివేక్ వెనువెంటనే స్పందించి తన ఇన్నోవాలో సివిల్ హాస్పటల్ కు పంపడం జరిగింది. దీంతో ఎస్సై ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్లూ కోర్ట్ టీం విక్రమ్, వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.