నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు
హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ రోడ్లు వంతెన నిర్మాణం కోసం పంచాయతీరాజ్ సీఆర్ఆర్ గ్రాంట్స్ నుండీ 1149. 00 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గంలో భారీగా రోడ్ల నిర్మాణం వంతెన కోసం నిధుల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకి, మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.