TG: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం వేర్వేరు డిజైన్‌లతో యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్‌కు సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.