హుస్నాబాద్ లో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సాయుధ పోరాటయోధుడు అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ పూలమాలవేసి ఆదివారం నివాళులర్పించారు. హుస్నాబాద్ పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.