కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చిచ్చు రాజేసిందని, వర్గీకరణ వద్దు కలిసుంటేనే ముద్దు అని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వెన్న రాజు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా జరిగే ఒకరోజు దీక్షకు మద్దతుగా హుస్నాబాద్ నుండి పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.