తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ జీవితంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలన్న, ముందడుగు వేయాలన్న గణపతి పూజ చేస్తాం, విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడిని మొక్కుతాం. విగ్నేశ్వరుడికి నవరాత్రులు పూజలు చేసే ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరికి విజయం కలగాలని కోరారు.