వర్గల్ భూ నిర్వాసితుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని గజ్వేల్ ఆర్డీఓ బన్సీలాల్ పేర్కొన్నారు. వర్గల్ శివారు పారిశ్రామిక వాడలో ఆందోళన చేస్తున్న భూనిర్వాసితులతో మంగళవారం సమావేశమయ్యారు. ఇంటి నిర్మాణ స్థలాల ప్లాట్లు సర్వే చేసి పొజిషన్ ఇస్తామని పేర్కొన్నారు. ఏసిపి పురుషోత్తం రెడ్డి, తహసిల్దార్ బాలరాజు, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై కరుణాకర్ రెడ్డి, టీజీ ఐఐసీ మేనేజర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.