గజ్వేల్ శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయం నుండి వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం వరకు శనివారం ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ శనివారం పాదయాత్రగా బయల్దేరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అద్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ అయిత సత్యనారాయణ ప్రతి సంవత్సరం దసరా రోజున పాదయాత్ర చేయడం గొప్ప విషయం అన్నారు. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని సత్యనారాయణ తెలిపారు.