పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించామని గజ్వేల్ సీఐ సైదా, అదనపు సీఐ ముత్యంరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ఫోన్లు పోగొట్టుకున్న వారి నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్లో ఫోన్ వివరాలను నమోదు చేయడం ద్వారా వాటిని రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.