మిలాద్ ఉన్ నబి పండుగను 16వ తేదీ నుంచి 19వ తేదీకి వాయిదా వేసుకున్నట్లు ముస్లిం సోదరులు అంగీకరించినట్లు డిఎస్పీ తెలిపారు. తూప్రాన్ లో మంగళవారం ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జన ఉత్సవం, మిలాద్ ఉన్ నబి పండుగ వేరువేరుగా జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగ కృష్ణ పాల్గొన్నారు.