సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో రేపు గురువారం నుంచి సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ అనురాధ మంగళవారం తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉంటాయన్నారు.