సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామ బూత్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ తండ్రి తిప్పగౌని సత్తగౌడ్ మరణించడంతో సోమవారం రమేష్ గౌడ్ ని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కౌకురి యాదగిరి, బిజెపి సీనియర్ నాయకుడు నాయిని రాజగోపాల్ పరామర్శించారు. వీరితో పాటు మండల ఉపాధ్యక్షుడు మొద్దు రాజు, మండల కార్యవర్గ సభ్యులు బోటుక మల్లేశం, దీపాయం పల్లి శక్తి కేంద్రం ఇంచార్జ్ చిక్కుడు స్వామి పాల్గొన్నారు.