బాధిత కుటుంబానికి పరామర్శ

268பார்த்தது
బాధిత కుటుంబానికి పరామర్శ
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త బోయిని ఎల్లం కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు ఆదేశాల మేరకు మండల బీజేపీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని వేళలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, ఉపాధ్యక్షులు స్వామి గడ్డమీది, జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు, సర్పంచులు సురేందర్ రెడ్డి, లావణ్య నర్సింహారెడ్డి, బిజెపి నాయకులు గంగాధరి రవీందర్, భూపాల్ రెడ్డి, ముత్యాల శ్రీను తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி