దశదినకర్మ స్నానానికి వెళ్లిన వరగల్ మండలం తునికి మక్త గ్రామానికి చెందిన రాములు (58) కుంటలో పడి మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి సోమవారం తెలిపారు. రాములు స్నానం చేస్తుండగా కనిపించకుండా వెళ్లినట్లు పేర్కొన్నారు. గాలింపు చర్యలు చేపట్టడంతో శవం కనిపించిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.