తొగుట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి
కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని వాటిని దశాబ్ది ఉత్సవాల్లో వివరించాలని కోరారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కమురయ్య, ప్యాక్స్ చైర్మన్ హరికృష్ణ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, సర్పంచ్ కొండల్ రెడ్డి, నర్సింలు, మంజుల ఇంఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ చందన, ఏపీఎం ముగ్దుమ్ అలీ, ఏపీవో కిషన్, ఏవో మోహన్, అన్ని గ్రామాల ఏఈవో లు, సెక్రటరీలు అధికారులు, నాయకులు పాల్గొన్నారు