సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఇండుప్రియల్ గ్రామానికి చెందిన ఇటీవల యాక్సిడెంట్ అయి మరణించిన వికలాంగుడైన వెంకటేష్ కుటుంబానికి వీరమ్మ మల్లేష్ ఎంపీటీసీ ఇందుప్రీయాల్ ఆర్థిక సహాయంతో పాటు ఒక క్వింటాల్ బియ్యం అందించడం జరిగింది. అలాగే సూరంపల్లి కుమార్ కూడా 50 కిలోల బియ్యం సాయం చేశారు. ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం మాట్లాడుతూ పిల్లల కోసం గ్రామంలోని మానవతవాదులు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చూస్తానని అన్నారు. గతంలో కూడా నిరుపేద కుటుంబాలకు గ్రామంలోని యువకులు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబగ యాదగిరి బిఆర్ఎస్ నాయకులు, పోతరాజు భాస్కర్, సూర్య ప్రకాష్, సంబగ స్వామి తదితరులు పాల్గొన్నారు.