పండుగలకు పర్యావరణానికి అవినాభావ సంబంధం ఉంది చాల వరకు పండుగలు ప్రక్రుతితొ ముడిపడి ఉన్నయి అలాగే ప్రతి పండుగ కూడా ఆధ్యాత్మిక దృష్టితో, ఆరోగ్య దృష్టితో ఏర్పడిందే. ఆధ్యాత్మిక కోణం కొందరికి తెలిస్తే ఆరోగ్య దృక్పథం మరికొందరికి తెలుసు. ఈ రెంటినీ కలిపి కలిగిన బుద్ధి గల వారికి పండుగ గురించి వాదవివాదాలు ఉండనే ఉండవు- రావు కూడా. ఆశ్వీయుజ మాసం అనేది హేమంత ఋతువులో వస్తుంది. చక్కని చలి దానితోపాటు మంచూ ప్రారంభమయ్యేవి. ఈ ఋతువులొ సూర్య ప్రకాశం తక్కువగా భూమికి ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి హానికరమైన క్రిమి కీటకాల పుట్టుక ఎక్కువగా ఉంటుంది.
చక్కని మట్టి ప్రమిదలొ నువ్వుల నూనెను పోసి పత్తి చెట్టుకి సంబంధించిన దూది వత్తినే వేయాలన్నారు. మట్టి ప్రమిద కాబట్టి దీపం వెలుగుతున్నంతసేపు మట్టినే తన వేడితొ వెడెక్కెలా చేసి తన నువ్వులనూనె కారణంగా వెలుగుతున్న పత్తి వత్తి ద్వారా వాతావరణ కాలుష్యాన్ని హరింప చేస్తుంది. దీపపు వత్తి నుండి ఒక సన్నని కనిపించని ఆవిరి పొగ వెళ్తూ ఉంటుంది పైకి అలా ఆవిరిగా వెళుతుండె పొగ ఈ హేమంత రుతువులో వచ్చే ఆశ్వీయుజ, కార్తీక మాసాలు రెంటిలోనూ తమంతట తాము పూర్తిగా పుట్టిస్తూ ఉండే క్రిమికీటకాల నే పూర్తిగా చంపగలవు. అందుకే కార్తీక మాసంలో కూడా దీపాలని నెల పొడుగునా పెట్టాలనే నియమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. ఆవు నేతి దీపం నుండి వచ్చే పొగ ఆవిరి స్త్రీలకి శ్వాసకోస వ్యాధులు, అజీర్ణాన్ని కలగజేయాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దేవాలయాలు ఒకప్పుడు ఆవునేతి అఖండ దీపాలను వెలిగిస్తూ ఉండేవారు. ఆ కారణంగా తలుపులన్నీ మూసి గర్భాలయంలో దుర్వాసన క్రిమికీటకాల ఉత్పత్తి ఉండకుండా రక్షణ జరుగుతూ ఉండేది.
హోమాల్లొ కూడా ఆవు పిడకలు ఎక్కువగా వాడుతుండేవారు ఈ హేమంత రుతువులో. దీని ద్వారా హోమాన్ని చేస్తుండే వారికి, ఆసక్తితో చూడ వచ్చిన వారు కూడా శ్వాసకోశవ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్య. అందుకే నరక చతుర్దశి దీపావళిలొ కూడా లోకమంతా దీపాలు దీపాలు దీపాలమయమె అవుతూ కనిపిస్తుంది- కనిపించాలి కూడా. ఆకాశంలో ఉన్న ఆ మంచు ఈ వేడికి కరిగి క్రిమికీటకాల ఉత్పత్తికి తోడ్పడుతుండెది కాదు. నేల దీపాలు భూమి మీది క్రిమి కీటక నాశనానికి- ఆకాశ దీపం అక్కడి వాటి నాశనానికి. ఇక సామాన్య జనులందరూ కొబ్బరి పీచు నుండి వచ్చిన పొట్టుకి బొగ్గుల ముక్కల్ని కలిపి కొబ్బరి డొక్కల మధ్య పోసి దాన్ని ఓ రేకుల గుట్ట లో పెట్టి ఓ తాడు కట్టి బలంగా తిప్పుతూ ఉండేవారు దానినుండి నిప్పురవ్వలు ఎర్రగా అలా తిప్పుతున్న దానికనుగుణంగా ఎర్రని చక్రాల గాల్లో కనిపిస్తుంది. వాటి ద్వారా కూడా క్రిమికీటకాల ఉత్పత్తి ఉండేది కాదు. ఇది