కాంగ్రెస్‌కు షాక్.. ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా?

72பார்த்தது
కాంగ్రెస్‌కు షాక్.. ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా?
TG: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ పార్టీకి రాజీనామా చేయగా.. అదే బాటలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా నడవబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు మంత్రిగా పని చేసిన ఆయన.. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ప్రస్తుతం ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. దీంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

தொடர்புடைய செய்தி