సిరియా మరోసారి అట్టుడిగిపోతోంది. భద్రతా దళాలు, సిరిమా మాజీ అధ్యక్షుడు అల్ అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో రెండు రోజుల్లో ఇప్పటి వరకు 1000 మంది మరణించారు. మృతుల్లో 700 మందికి పైగా సామాన్య పౌరులు ఉండడం కలిచివేస్తుంది. అల్ అసద్‌ను అధికారం నుంచి తప్పించి తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించడంతో ఈ గొడవలు చెలరేగాయి.