ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్‌తో హనుమంతరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వీహెచ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అంబేద్కర్ తర్వాత ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నేత సంజీవయ్య అని ఆయనకు మరింత గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని వీహెచ్ అన్నారు.