సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో ఉన్న పాత చెక్కుపోస్ట్ వద్ద ఉన్న లేప్రాసి ఆసుపత్రిలో నివసిస్తున్న కృష్ఠ రోగుల కుటుంబాలకు ది ఫాదర్ హౌస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్" మేరి కిరణ్ పాల్, వారి ఆదేశానుసారం మేరకు గత మూడు నెలల నుండి నెలకు సరిపడే వస్తువులను అందజేస్తూ మంగళవారం ఆ సంస్థ మేనేజర్ బి. నర్సింహులు , ఆధ్వర్యంలో నివసిస్తున్న కుటుంబలందరికీ నెలకు సరిపడు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది.
అనంతరం స్వచ్ఛంద సంస్థ వారు మాట్లాడుతూ ది ఫాదర్ హౌస్ అనే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడ మా సంస్థ నిరుపేదల కుటుంబాలకు గాని అదేవిధంగా హెచ్ఐవి రోగులకు సుమారుగా 500కు పైగా వైద్యం మరియు వారి శరీరంలో యుమినిటి పవర్ పెంచడానికి కావలసిన వస్తువులను అందజేస్తున్నాం అని అదేవిధంగా సాయంత్ర కాల సమయంలో కూడ నిరుపేద కుటుంబంలో ఉన్న పేద పిల్లలకు కూడ ఉచితంగా ట్యూషన్ రూపంలో వారికి విద్యను కూడ అందిస్తున్నామని అన్నారు.
అంతేకాకుండా నిరుపేద వితంతు ఒంటరి మహిళలకు కూడ నెలకు డబ్బులను కూడ ఇస్తున్నాంమని, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడ మా సంస్థ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ మాకు తోసినా సాయం మా సంస్థ ఎప్పటికీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, కౌడి, మొహమ్మద్ అల్లావుద్దీన్ నర్సింహులు, సుధాకర్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.