హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష

67பார்த்தது
హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష
హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఐదువేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్ కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్య పై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி