ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పిఆర్టియు అభ్యర్థి మహేందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని విద్యానగర్ కమ్యూనిటీ హాలులో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టిఆర్టి మొదటి నుంచి ఉపాధ్యాయ పక్షాన ఉంటుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.