అసెంబ్లీ ఎన్నికల సమయంలో గొప్ప గొప్ప పథకాలు తెస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలేమో గానీ ఉన్న పథకాలను ఎలా ఊడగొట్టాలో అని ఆలోచిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. ఈ విషయంపై చింతా ప్రభాకర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని అన్నారు.