ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించే బీసీల సమరభేరిని జయప్రదం చేయాలని జబర్దస్త్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ కోరారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బీసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్ పాల్గొన్నారు.