భారతీయ కిసాన్ సంఘ్ సంగారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం ఆ సంఘం పట్టణ అధ్యక్షులు అల్లంరెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వెనకాల ఉన్న పార్కులో జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండు చేస్తూ ఈ నెల 5వ తేదీ శనివారం కామారెడ్డిలో జరిగే రాష్ట్ర మహాసభలో పట్టణం నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.