దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో కలశ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై కలశ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో చంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించారు.