జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర ఆదేశాల మేరకు జిన్నారంలోని కస్తూర్బా బాలికలకు ఆరోగ్య సూత్రాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల మెడికల్ అధికారి 13 అంశాల గురించి బాలికలకు వివరించారు. జిల్లాలోని అన్ని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు.