గాంధీ ఆసుపత్రిలో జర్నలిస్టులపై మంత్రి దామోదర రాజనర్సింహ అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జోగిపేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ, మంత్రి జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడటం సరికాదని చెప్పారు. మంత్రి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.