ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో ఆదివారం డాక్టర్. బీఆర్ అంబేద్కర్ 133 వ జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎర్రోళ్ల జోగినాథ్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు సంఘం కార్య వర్గ సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు.