గోల్ఫ్ కోర్టు వద్ద అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేస్తానని.. కొన్ని నెలల ముందే ర్యాన్ రౌత్ ఓ లెటర్ రాశాడని యూఎస్ ప్రాసిక్యూటర్ పేర్కొంది. అతడు మందుగుండు సామగ్రి, ఓ మెటల్ పైప్, నిర్మాణ సామగ్రి, ఫోన్లు, కొన్ని లేఖలు ఉన్న పెట్టెను గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు పడేశాడని ఆరోపించింది. ట్రంప్‌పై హత్యాయత్నం గురించి తెలిసిన తర్వాత ఆ లేఖ ఉన్న బాక్స్‌ను ఆ గుర్తుతెలియని వ్యక్తి తెరిచాడని వెల్లడించింది.