హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీసులు బొగ్గులకుంట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అబిడ్స్ వైపు నుండి అమిత్ అనే బట్టల వ్యాపారి స్కూటర్‌పై బొగ్గులకుంట వైపు వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అమిత్ వద్ద ఉన్న ఓ బ్యాగ్‌లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులు డబ్బును సీజ్ చేశారు.