TG: పాలమూరు ప్రగతిపై రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వానికి ఆపడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేతకాని తనాన్ని గుర్తుచేస్తే, తమపై రంకెలేస్తున్నారని, చంద్రబాబుకు పాదసేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలకు రేవంత్ కాలరాశాడని మండిపడ్డారు. కాంగ్రెస్, TDPలతో అంటకాగి పాలమూరుకు రేవంత్ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.