సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఫ్లైట్ మోడ్‌లోనే ఉంటారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం కామారెడ్డి జిల్లా పర్యటలో భాగంగా బాన్సువాడలో ఆమె మాట్లాడారు. "రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం. అందుకే 15 రోజులకొకసారి రేవంత్ ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు సీఎం వింటారు. 15 నెలలుగా జనాలు అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడతారు." అంటూ కవిత విమర్శించారు.