TG: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నిందితుడు గుండు అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు, రూ. 30వేల జరిమానా, బాధితురాలికి రూ. 15 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.