రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ సేవా భారతి ఆధ్వర్యంలో శుక్రవారం పద్మశాలి పురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ క్లాస్ నిర్వహించబడింది. ప్రభుత్వ ఉద్యోగి, అనుభవజ్ఞుడైన అకౌంట్ మేనేజర్ చంద్రశేఖర్ ఈ తరగతిని నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ తరగతిలో పాల్గొన్నారు.