సమాజానికి ఎవరైనా సరే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయవద్దని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో అన్నారు. శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.