రేవంత్ రెడ్డిని నమ్మేది లేదు వదిలేది లేదని రేవంత్ రెడ్డిలో నిజాయితీ, బాధ్యత లేదని బయట మీటింగ్ లో చెప్తున్న మాట కాదు, నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట ఏమైందో రేవంత్ చెప్పాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ విమర్శించారు. శుక్రవారం షాద్‌నగర్ పోలీసులు నరసింహ మాదిగను సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.