షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం వెల్జర్ల గ్రామానికి చెందిన దొడ్డి శ్రీనివాస్ (న్యాయవాది)ని బీఎస్పీ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జ్ గా నియమితులైనారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రo శేఖర్, గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శి గ్యార జగన్ బుధవారం నిర్వహించిన జిల్లా సమావేశంలో నియామకాన్ని ప్రకటించినారు.