రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులాల సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల అన్నారు. అదివారం పాపిరెడ్డిగూడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా వారి గృహంలో కులగనన సర్వే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.