శేరిలింగంపల్లి: అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశం
శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషిచేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వే నిర్వహణపై శుక్రవారం ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో సీఎస్ సమీక్షించారు. సర్వేకు సంబంధించి స్టిక్కరింగ్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈ నెల 9 నుంచి వివరాల సేకరణ మొదలవుతుందని చెప్పారు.