పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని అభినందన్ హోటల్లో గురువారం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సుధాకర్ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 12 బీసీ కుల ఫెడరేషన్లను బీసీ కార్పొరేషన్లుగా మార్చాలని పేర్కొన్నారు.