సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇండ్ల జాబితాను తయారు చేస్తారని, ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేర్లతో కూడిన స్టిక్కర్లను అందజేస్తారని తెలిపారు. 9వ తేదీ నుంచి సర్వే మొదలవుతుందని చెప్పారు.