అఖిల భారత యాదవ మహాసభ, విద్యావంతుల వేదిక రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా యేషాం మల్లేష్ యాదవ్ నియమిస్తూ, ఈ మేరకు నియామక పత్రం అందించిన రాష్ట్ర కన్వీనర్ చలకాని వెంకట్ యాదవ్. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ విద్యావంతుల వేదిక కు సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. తన పై నమ్మకం ఉంచి అఖిల భారత యాదవ మహాసభ, విద్యావంతుల వేదిక రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాధ్యతను అప్పగించి నాకు సహకరించినవారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మే 3న యాదవ విద్యావంతుల వేదిక అధ్వర్యంలో జరగబోయే యాదవ ఆత్మగౌరవ సభ విజయవంతం చేయడానికి తన పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. యాదవ విద్యావంతుల వేదిక ముఖ్య సంకల్పం హైదరాబాద్ లో యాదవ్ విద్యార్ధి వసతి గృహము నిర్మాణము, దీనికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఒక ప్రకటన లో తెలిపారు.