మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ బీజేపీ నగర కార్యాలయంలో సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు కార్పొరేటర్లు కన్నె ఉమాదేవి, వై. అమృతతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎంకి దమ్ముంటే బుల్డోజర్లతో మమ్ములను తొక్కించాలని సవాల్ విసిరారు.